Corona Virus: కరోనా వుంటే కనుక ఐదు నిమిషాల్లోనే చెప్పేసే పరీక్ష రెడీ!

corona virus test in five minutes
  • కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన అమెరికా సంస్థ
  • ఇప్పటికే ఎఫ్ డీఏ నుంచి అత్యవసర అనుమతి
  • వారం రోజుల్లో అందుబాటులోకి
కరోనా వైరస్‌పై ప్రయోగాల్లో కీలక ముందడుగు పడింది. ఒక మనిషిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షకు ప్రస్తుతం ఒకటి రెండు రోజుల సమయం పడుతోంది. కానీ, ఈ పరీక్షను నిమిషాల్లోనే పూర్తి చేసేందుకు కొత్త టెక్నాలజీని కనుగొన్నారు. కరోనా ఉందో లేదో ఐదు నిమిషాల్లోనే తేల్చేసే ప్రక్రియను అమెరికాకు చెందిన ఓ సంస్థ అభివృద్ధి చేసింది.

అమెరికాకు చెందిన అబోట్ ల్యాబొరేటరిసీస్ అభివృద్ధి చేసిన ఈ విధానానికి అత్యవసర ప్రక్రియ కింద ఆ దేశ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డీఏ) అనుమతి కూడా ఇచ్చింది. అయితే, తమకు పూర్తి స్థాయి అనుమతి రాలేదని సదరు సంస్థ తెలిపింది. ప్రస్తుతానికి గుర్తింపు పొందిన ల్యాబ్‌లో అత్యవసర ప్రాతిపదికన ఈ ప్రక్రియను ఉపయోగించడానికి గ్రీన్ సిగ్నల్‌ వచ్చిందని చెప్పింది. వచ్చే వారం నుంచి దీన్ని అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.

 ఈ ప్రక్రియలో కరోనా వైరస్‌ వుంటే కనుక ఫలితం ఐదు నిమిషాల్లోనే వస్తుందని తెలిపింది. నెగిటివ్ ఉంటే మాత్రం ఫలితం రావడానికి 13 నిమిషాల సమయం పడుతుందని చెప్పింది.
Corona Virus
test
five
minutes
new
technology
USA

More Telugu News