Corona Virus: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ రూ. 7.75 కోట్ల విరాళం

Tennis star Roger Federer announces 7 crore donation
  • స్విట్జర్లాండ్‌పైనా కరోనా పంజా
  • 8,800 కేసులు నమోదు
  • 86 మంది మృతి
కరోనా వైరస్ నియంత్రణ కోసం టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తనవంతు సాయంగా రూ.7.75 కోట్ల విరాళం ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ప్రకటించాడు. ఈ సందర్భంగా ఫెదరర్ మాట్లాడుతూ.. తన భార్య మిర్కా, తాను వ్యక్తిగతంగా ఈ మొత్తాన్ని విరాళంగా ఇస్తున్నట్టు చెప్పాడు. కోవిడ్-19 ఇప్పుడు అందరికీ సవాలుగా మారిందని, ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేకుండా ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు.

కాగా, స్విట్జర్లాండ్‌లోనూ కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తోంది. నిన్న రాత్రి నాటికి అక్కడ మృతి చెందిన వారి సంఖ్య 86కు చేరుకుంది. కరోనా కేసులు ఎక్కువగా నమోదైన టాప్-10 దేశాల్లో స్విట్జర్లాండ్ కూడా ఉంది. ఇప్పటి వరకు 8,800 కరోనా నిర్ధారిత కేసులు నమోదయ్యాయి.
Corona Virus
Switzerland
Roger Federer
Tennis Star

More Telugu News