Corona Virus: ప్రయాణికులు వెళ్లిపోయినా.. డైమండ్ ప్రిన్సెస్ నౌకలో ఇంకా సజీవంగా ఉన్న కరోనా వైరస్

Corona virus still live on Diamond Princess cruise ship
  • ఇటీవల యోకహామా రేవులో నిలిచిపోయిన డైమండ్ ప్రిన్సెస్ నౌక
  • నౌకలోని 700 మందికి సోకిన కరోనా
  • ఇటీవలే నౌక నుంచి ప్రయాణికుల తరలింపు
  • నౌక క్యాబిన్లలో కరోనా ఉనికిని గుర్తించిన సీడీసీ పరిశోధకులు
ఓ ఉపరితలంపై కరోనా వైరస్ 12 గంటల కంటే ఎక్కువసేపు మనుగడ సాగించలేదని ఇటీవల జనతా కర్ఫ్యూ సందర్భంగా కేంద్రం ప్రచారం చేసింది. అయితే, ఆశ్చర్యకరమైన రీతిలో కరోనా వైరస్ 17 రోజుల పాటు బతికి ఉండడాన్ని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) పరిశోధకులు గుర్తించారు. చైనాలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్న సమయంలో ప్రముఖ పర్యాటక నౌక డైమండ్ ప్రిన్సెస్ జపాన్ లోని యోకహామా రేవులో నిలిచిపోయింది. ఆ నౌకలోని దాదాపు 700 మంది ప్రయాణికులకు కరోనా పాజిటివ్ ఫలితాలు రావడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఎట్టకేలకు డైమండ్ ప్రిన్సెస్ లోని ప్రయాణికులందరినీ తరలించారు. తరలింపు కార్యక్రమం జరిగి రెండు వారాల పైనే అయింది. అయినప్పటికీ డైమండ్ ప్రిన్సెస్ క్రూయిజ్ నౌకలోని క్యాబిన్లలో కరోనా వైరస్ ఉనికిని పరిశోధకులు కనుగొన్నారు. గత 17 రోజులుగా వైరస్ ఆ నౌకలో మనుగడ సాగిస్తుండడం ఆ మహమ్మారి మొండితనాన్ని సూచిస్తోందని పరిశోధకులు అంటున్నారు.
Corona Virus
Diamond Princess
Cruise Ship
Japan
Yokahama
COVID-19
CDC

More Telugu News