Rajasekhar: పేద కళాకారులకు పది రోజులకు సరిపడా నిత్యావసరాలు అందించిన హీరో రాజశేఖర్

Hero Rajasekhar helps poor artists and cine labour

  • దేశవ్యాప్తంగా కరోనా స్వైరవిహారం
  • నిలిచిపోయిన సినిమా షూటింగులు, సీరియళ్ల చిత్రీకరణ
  • చిత్రపరిశ్రమ కళాకారుల కోసం ముందుకొచ్చిన రాజశేఖర్

కరోనా మహమ్మారి విజృంభణతో దేశవ్యాప్తంగా సినిమా షూటింగులు, టీవీ సీరియళ్ల చిత్రీకరణ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. షూటింగులు రద్దవడంతో అనేకమంది పేద కళాకారులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారిపట్ల హీరో రాజశేఖర్ సానుభూతితో స్పందించారు. చిత్రపరిశ్రమకు చెందిన పేద కళాకారులు, పలు విభాగాలకు చెందిన కార్మికులకు ఆయన తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆపన్నహస్తం అందించారు. వారికి పది రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు.

Rajasekhar
Tollywood
Corona Virus
Artists
Labour
Donation
Charity
  • Loading...

More Telugu News