10th Class: 'అమ్మఒడి' పథకంపై మీ ఫ్రెండ్ కు లేఖ రాయండి... ఏపీ టెన్త్ క్లాస్ ప్రీఫైనల్స్ లో అడిగిన ప్రశ్న ఇది!

questions on government schemes in tenth class pre public exams

  • ప్రస్తుతం ఏపీలో పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు
  • ఇంగ్లీషు సబ్జెక్టు పేపర్ లో ఆసక్తికర ప్రశ్నలు
  • ప్రభుత్వ పథకాలను పరీక్ష పేపర్ కెక్కించిన వైనం

ప్రస్తుతం ఏపీలో టెన్త్ క్లాస్ ప్రీ పబ్లిక్ పరీక్షలు జరుగుతున్నాయి. ఇంగ్లీషు సబ్జెక్టు ప్రశ్నాపత్నంలో కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు రావడం చర్చనీయాంశంగా మారింది. అమ్మఒడి పథకం రాష్ట్రంలో ఎలా అమలు జరుగుతోందో చెన్నైలో ఉన్న మీ ఫ్రెండ్ కు లేఖ రాయండి అంటూ ఓ ప్రశ్న అడిగారు. మరో ప్రశ్నలో...  మిమ్మల్ని మీరు ఓ మీడియా ప్రతినిధిలా భావించుకుని మీ స్కూల్లో అమ్మఒడి ఎలా అమలవుతుందో వార్త రూపంలో  రాయండి అంటూ అడిగారు. ఈ రెండు ప్రశ్నలను 5 మార్కుల విభాగంలో ఇచ్చారు. సృజనాత్మక భావవ్యక్తీకరణ విభాగంలో అడిగిన ఈ రెండు ప్రశ్నల్లో ఒకదానికి కచ్చితంగా సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రస్తుతం మీడియాలో ఈ అంశం అందరినీ ఆకర్షిస్తోంది.

10th Class
Pre Public
Amma Odi
English
Letter
  • Loading...

More Telugu News