Tractor: హైదరాబాద్​ లోని గణేశ్​పురి కాలనీలో ట్రాక్టర్​ బీభత్సం.. చాకచక్యంగా తప్పించుకున్న బాలుడు!

Tractor havoc in Hyderabad at Ganeshpuri colony

  • ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం
  • ఎగిరికిందపడ్డ ట్రాక్టర్ డ్రైవర్..అతని కాళ్లపై నుంచి వెళ్లిన చక్రాలు
  • గాయపడ్డ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించిన స్థానికులు

హైదరాబాద్ లో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. చైతన్య పురి, గణేశ్ పురి కాలనీలోని డీసెంట్ రోడ్డులో బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన సామగ్రిని తీసుకెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పింది. రోడ్డుకు ఎడమవైపు ఉన్న వాహనాలను ఢీ కొట్టింది. ట్రాక్టర్ డ్రైవర్ ఎగిరి కింద పడిపోవడంతో అతని కాళ్లపై నుంచి ట్రాక్టర్ చక్రాలు వెళ్లాయి. దూసుకుపోయిన ట్రాక్టర్ అలాగే కొంత దూరం ముందుకు వెళ్లి పక్కకు ఒరిగిపోయింది. ఈ ఘటనలో డ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలు అయినట్టు తెలుస్తోంది. గాయపడ్డ డ్రైవర్ ను స్థానికులు సమీప ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఐదు బైక్ లు, రెండు కార్లు దెబ్బతిన్నాయి. డ్రైవర్ పక్కనే మరో వ్యక్తి కూడా కూర్చుని ఉన్నాడు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

బాలుడి చాకచక్యం

ఈ ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఉన్న రెండేళ్ల బాలుడు చాకచక్యంగా వ్యవహరించాడు. ఈ ప్రమాదం బారిన తాను కూడా పడతానేమోనని ఊహించిన ఆ బాలుడు రోడ్డుపై నుంచి పరిగెత్తుకుంటూ తన తల్లికి దగ్గరకు వెళ్లిపోయాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Tractor
Havoc
Hyderabad
chaitanyapuri
Ganeshpuri colony
  • Loading...

More Telugu News