Hyderabad: రూ. 9 లక్షలకుపైగా పలికిన 9999 నంబరు.. దక్కించుకున్న ఆర్ఎస్ బ్రదర్స్

RTA Telangana Online Bidding For Fancy Numbers
  • హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఆన్‌లైన్ బిడ్డింగ్
  • మొత్తంగా రూ.31 లక్షలకు పైగా ఆదాయం
  • మూడు లక్షలు పలికిన ‘టీఎస్ 09 ఎఫ్ఎల్ 0001’ నంబరు
ఫ్యాన్సీ నంబర్ల వేలంతో తెలంగాణ రవాణాశాఖ భారీ ఆదాయాన్ని ఆర్జిస్తోంది. హైదరాబాద్, ఖైరతాబాద్‌లోని ఆర్టీఏ కార్యాలయంలో నిన్న 9999 నంబరుకు ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేలంలో రూ.9 లక్షలకుపైగా పలికింది. టీఎస్ 09 ఎఫ్‌కే నంబరును ఆర్‌ఎస్ బ్రదర్స్ సంస్థ రూ.9.14 లక్షలకు సొంతం చేసుకుంది. టీఎస్ 09 ఎఫ్ఎల్ 0001 నంబరును లహరి ఇన్‌ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రూ.3,81,111కు దక్కించుకోగా, టీఎస్ 09 ఎఫ్ఎల్ 0099 నంబరును అస్మిత పద్మనాభన్ రూ.3.33 లక్షలకు దక్కించుకున్నారు. ఆన్‌లైన్ బిడ్డింగ్‌లో మొత్తంగా రూ.31,48,487 రూపాయల ఆదాయం లభించినట్టు హైదరాబాద్ జేటీసీ పాండురంగనాయక్ తెలిపారు.
Hyderabad
Telangana
RTA
Online bidding
Fancy Numbers

More Telugu News