Galla Jayadev: ఏది సరైన నిరసనో, ఏది సరైన నిరసన కాదో చెప్పిన గల్లా జయదేవ్

Galla Jaydev clarifies what is right protest and what is another way of protest
  • చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తం
  • బాబును అడ్డుకునేందుకు టమాటాలు, కోడిగుడ్లతో వచ్చిన ఆందోళనకారులు
  • ఇది వైసీసీ తరహా నిరసన అంటూ ట్వీట్ చేసిన గల్లా జయదేవ్
టీడీపీ అధినేత చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన ఉద్రిక్తంగా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబును అడ్డుకునేందుకు కోడిగుడ్లు, టమాటాలతో వచ్చారంటూ వైసీపీ నేతలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్విట్టర్ లో స్పందించారు. "ఎక్కడైనా సక్రమంగా చేపట్టే నిరసనలు ఉంటాయి, వైసీపీ తరహా నిరసనలు కూడా ఉంటాయి. సరైన పద్ధతిలో నిరసన తెలియజేయడం అంటే అమరావతి రైతుల మాదిరి శాంతియుతంగా నిరసన చేయాల్సి ఉంటుంది. వైసీపీ తరహా నిరసన విధానం అంటే చెప్పులు విసరడం, టమాటాలు, కోడిగుడ్లు విసురుతూ హింసను ప్రేరేపించడం" అంటూ ట్వీట్ చేశారు.
Galla Jayadev
Chandrababu
Protests
Amaravati
Farmers
YSRCP
Tomatoes
Eggs

More Telugu News