Bonda Uma: చంద్రబాబు బస్సు యాత్ర అనగానే వైసీపీ నేతలు వణికిపోతున్నారు: బోండా ఉమ

  • రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతోంది
  • వైసీపీ నేతల దోపిడీ, భూ కబ్జాలను ప్రజలకు వివరిస్తాం
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం
Bonda Uma says chandra babu Bus Yatra trembles ysrcp leaders

చంద్రబాబు బస్సు యాత్ర అనగానే వైసీపీ నేతలు వణికిపోతున్నారని టీడీపీ నేత బోండా ఉమ వ్యాఖ్యానించారు. విజయవాడలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైసీపీ నేతలు చేస్తున్న దోపిడీ, భూ కబ్జాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు.

రాష్ట్రంలో అసమర్థ పాలన కొనసాగుతోందని, పరిపాలన చేతగాని వాళ్లు అధికారంలోకొస్తే పేదలు ఎంత కష్టపడతారనేది కళ్ల ముందు కనబడుతోందంటూ వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేసింది టీడీపీనే అని అన్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

More Telugu News