Carona Virus: తిరుపతిలో ‘కరోనా’ అనుమానితులు!

  • నలుగురు ‘కరోనా’ బారిన పడ్డట్లు అనుమానాలు
  • రుయా ఆసుపత్రికి తరలింపు
  • ఐసోలేటెడ్ వార్డులో వైద్య పరీక్షలు
ఏపీలో కరోనా వైరస్ వ్యాపించిందన్న వార్తలు కలకలకం సృష్టిస్తున్నాయి. చిత్తూరు జిల్లా తిరుపతిలో నలుగురు కరోనా వైరస్ బారిన పడ్డట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రుయా ఆసుపత్రికి వీరిని తరలించారని, ఐసోలేటెడ్ వార్డులో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు సమాచారం.

ఇదిలా ఉండగా, ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఇక్కడే ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ నేపథ్యంలో రుయా ఆసుపత్రి వైద్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఆసుపత్రిలో ఎనిమిది పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశారు.
Carona Virus
Tirupati
Ruya Hospital

More Telugu News