Shoaib Akhtar: ఇప్పటికిప్పుడు ప్రపంచ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ ఎవరో చెప్పిన అక్తర్

  • టీమిండియా పేసర్ షమీనే బెస్ట్ అంటున్న అక్తర్
  • వేగం, తెలివి షమీ సొంతమని వ్యాఖ్యలు
  • మరే జట్టులో ఇలాంటి బౌలర్ లేడని వెల్లడి

పాకిస్థాన్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ ప్రపంచ అత్యుత్తమ పేస్ బౌలర్ ఎవరో చెప్పాడు. తన దృష్టిలో వరల్డ్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్ అంటే టీమిండియా పేసర్ మహ్మద్ షమీనే అని స్పష్టం చేశాడు. వేగం, తెలివి షమీ సొంతమని అక్తర్ కొనియాడాడు. హామిల్టన్ టీ20 మ్యాచ్ లో ఆఖరి ఓవర్లో టేలర్ సిక్స్ కొట్టినా కుంగిపోకుండా తన అనుభవాన్ని ఉపయోగించి మ్యాచ్ ను భారత్ వైపు తిప్పిన ఘనత షమీదేనని ప్రశంసించాడు. యార్కర్లు ఫలితాన్నివ్వడంలేదని గ్రహించి లెంగ్త్ బాల్స్, బౌన్సర్లతో కివీస్ ను కట్టడి చేశాడని, అపార అనుభజ్ఞుడు టేలర్ ను బోల్తా కొట్టించిన వైనం మ్యాచ్ కే హైలైట్ అని అక్తర్ వ్యాఖ్యానించాడు. ప్రపంచంలోని మరే జట్టులోనూ ఇలాంటి ఫాస్ట్ బౌలర్ లేడని పేర్కొన్నాడు.

Shoaib Akhtar
Mohammad Shami
Fast Bowler
World Best
Team India
  • Loading...

More Telugu News