Delhii Assembly Elections: ఢిల్లీ ఎన్నికల ప్రచారానికి గ్లామర్ ... సినీతారల రంగప్రవేశం!

  • వారం రోజుల్లో ఎన్నికలుండటంతో ప్రచారం ఉద్ధృతం
  • ప్రచారంలో సన్నీడియోల్, సప్నా చౌదరి, రవికిషన్..
  • ఢిల్లీలో స్థిరపడ్డ వారిని ఆకట్టుకునేందుకు బీజేపీ పాట్లు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం ముగియడానికి మరో వారం రోజులు మాత్రమే గడువు ఉండటంతో.. రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా అధికార ఆమ్ ఆద్మీ పార్టీని మట్టి కరిపించాలని ప్రతిపక్ష బీజేపీ ముందుకు సాగుతోంది. తమ ఎన్నికల ప్రచారంలో తారలను, కళాకారులను దించడానికి నిర్ణయించిందని  బీజేపీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.

ఢిల్లీలో ఉంటోన్న విభిన్న ప్రాంతాల ప్రజలను ఆకట్టుకోవడానికి విభిన్న కళాకారులు, తారలను ప్రచారంలో వినియోగించుకోవడానికి సమాయత్తమైనట్లు తెలిపారు. బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్, హర్యానా సింగర్, డ్యాన్సర్ సప్నా చౌదరి, సింగర్ దినేశ్ లాల్ నిరాహువా, భోజ్‌పురి కళాకారుడు రవి కిషన్, కేసరిలాల్ యాదవ్ తదితరులు బీజేపీ తరపున ప్రచారానికి దిగనున్నారని ఆయన వెల్లడించారు.

ఢిల్లీలో నివసిస్తున్న సిక్కు వర్గాలకు చెందిన ఓటర్లను ఆకర్షించేందుకు సన్నీ డియోల్ తో రోడ్ షోలు, యూపీ, బీహార్ ఓటర్లను ఆకట్టుకునేందుకు రవికిషన్, నిరాహువాలను రంగంలోకి దించుతోండగా, హర్యానా ఓటర్లను ఆకట్టుకునేందుకు డ్యాన్సర్ సప్నా చౌదరిని ప్రచారంలో ఉపయోగించుకోవాలని బీజేపీ నిర్ణయించింది.
Delhii Assembly Elections
campaign
Actors
Artists

More Telugu News