Panchumarthi Anuradha: వైఎస్ రాజారెడ్డి పేరుమీద ధర్మాన భూములు కొట్టేశారు: పంచుమర్తి అనురాధ

  • జగన్ కుటుంబం కన్ను విశాఖపై పడిందని ఆరోపణలు
  • విశాఖలో కడప దందాలు పెరిగాయని ఆగ్రహం
  • సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన పంచుమర్తి

టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. సీఎం జగన్ కుటుంబం కన్ను విశాఖపై పడిందని ఆరోపించారు. విశాఖలో కడప దందాలు పెరిగాయని మండిపడ్డారు. వైఎస్ కుటుంబం ఇప్పటివరకు 32 వేల ఎకరాలు కబ్జా చేసిందని అన్నారు.

వైఎస్ రాజారెడ్డి పేరుమీద ధర్మాన ప్రసాదరావు భూములు కొట్టేశారని అనురాధ ఆరోపించారు. 7 నెలల వ్యవధిలో 1800 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాహా చేశారని, ఆఖరికి స్వాతంత్ర్య సమరయోధుల భూములనూ వదలడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింహాచలం దారిలో 400 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు ప్రయత్నం జరిగిందని ఆమె వివరించారు. తాజాగా ల్యాండ్ పూలింగ్ పేరుతో విశాఖలో పేదల భూమి కబ్జా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో వైసీపీ నేతల భూకబ్జాలపై సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News