Rabbit: కర్ణాటకలో సంక్రాంతికి వింత ఆచారం.. కుందేలుకి బంగారంతో చెవులు కుట్టించారు!

  • కర్ణాటకలో సంక్రాంతి ఆనవాయితీ
  • తమ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ప్రజల నమ్మకం
  • ఎన్నో ఏళ్లుగా వస్తున్న ఆనవాయితీ

సంక్రాంతి పండుగకు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన ఆచారాలు పాటిస్తుంటారు. కర్ణాటకలో కూడా సంక్రాంతికి ఓ వింత సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఇక్కడి చిత్రదుర్గ జిల్లా కాంచీపురంలో ప్రతి సంక్రాంతికి అడివికి వెళ్లి ఓ కుందేలును పట్టుకొచ్చి బంగారంతో చెవులు కుట్టిస్తారు. ఇలా చేయడం వల్ల తమ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుందని, ప్రజలందరూ భోగభాగ్యాలతో తులతూగుతారని అక్కడి ప్రజలు నమ్మకం.

 అందుకే అడవి కుందేలును తీసుకొచ్చి దానికి బంగారంతో చెవులు కుట్టించిన తర్వాత గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. అనంతరం వరదరాజ స్వామి ఆలయంలో పూజలు చేస్తారు. ఎన్నో ఏళ్లుగా ఈ ఆనవాయితీని గ్రామస్తులు క్రమం తప్పకుండా పాటిస్తున్నారు. ఈసారి కూడా అడవి కుందేలుకు చెవులు కుట్టించి పూర్వీకుల ఆచారాన్ని కొనసాగించారు.

Rabbit
Karnataka
Sankranthi
Tradition
Chitradurga
  • Loading...

More Telugu News