Kareena Kapoor: కరీనా లేటెస్ట్ ఫొటో షూట్... ఫొటో షాప్ చేసినట్టు స్పష్టం కావడంతో విపరీతమైన ట్రోలింగ్!

  • మేగజైన్ కోసం కరీనా ఫొటో షూట్
  • కాలు అందంగా కనిపించాలని మార్ఫింగ్
  • వెనుక నీడను మాత్రం మరచిపోయిన వైనం

బాలీవుడ్ అందాల నటి కరీనా కపూర్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 40 సంవత్సరాల వయసులోనూ తన అందంతో అభిమానులను మెప్పిస్తూనే ఉన్న కరీనా, తాజాగా తీయించుకున్న ఓ ఫొటో షూట్ మాత్రం తీవ్ర వివాదాస్పదమైంది. తాను తీయించుకున్న ఫొటోకు ఆమె ఫొటోషాప్ లో మెరుగులు దిద్దించిన తీరు స్పష్టంగా తెలుస్తూ ఉండటమే ఇందుకు కారణం.

తాజాగా ఓ మేగజైన్ కు కవర్ పేజీ కోసం కరీనా ఫొటోలకు పోజులిచ్చింది. ఈ ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో ఆమె పోస్ట్ చేయగా, అది మార్ఫింగ్ చేసిన ఫొటో అని ఫ్యాన్స్ పట్టేశారు. ఇంకేముంది? కరీనాపై ట్రోలింగ్ మొదలైంది.

ఇంతకీ కరీనా ఏం మార్ఫింగ్ చేయించిందని అడుగుతారా? ఈ చిత్రంలో దిండుపై ఉన్న కరీనా కాలు నీడను చూస్తే మీకే తెలుస్తుంది. ఆమె తన మోకాలు భాగాన్ని ఎడిట్ చేయించారని! అయితే, కాలు నీడను మాత్రం మరచిపోయారని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాలు కోసం అంత ఎడిటింగ్ అవసరమా? అని ప్రశ్నిస్తున్నారు. ఇక మార్ఫింగ్ చేసిన వాళ్ల నైపుణ్యం అత్యంత చెత్తగా ఉందని మండిపడుతున్న వాళ్లూ లేకపోలేదు. ఇక కరీనా మాత్రం ఈ విషయంలో ఇంకా స్పందించ లేదు.

  • Loading...

More Telugu News