Assom: బాలికపై అసోం ఎస్పీ లైంగిక దాడి... అట్టుడుకుతున్న రాష్ట్రం!

షార్ట్స్‌లో చూడండి
ఓ మైనర్ బాలికపై అసోంకు చెందిన ఎస్పీ లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలు రావడంతో, ఇప్పుడా రాష్ట్రం అట్టుడుకుతోంది. కర్బీ అంగ్ లాంగ్ పట్టణానికి చెందిన ఎస్పీ గౌరవ్ ఉపాధ్యాయ్, ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేశారన్న ఆరోపణలు వచ్చాయి. బాలికే స్వయంగా ఫిర్యాదు చేయడంతో పోలీస్ కమిషనర్ ఎంపీ గుప్తా, కేసును నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో గౌరవ్ పై పోస్కో చట్టంలోని సెక్షన్ 10 కింద కేసు నమోదైంది. కేసు తీవ్రత దృష్ట్యా, ఎస్పీని విధుల నుంచి తప్పించినట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు. కాగా, ఈ కేసు, తనపై కక్ష సాధింపు కోసమే పెట్టారని గౌరవ్ వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.
Go Back to Shorts
Assom
SP
Rape
Case
Police

More Telugu News