SarileruNeekevvaru: సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం... ఎల్బీ స్టేడియంలో మొదలైన కోలాహలం

  • హైదరాబాదులో సరిలేరు నీకెవ్వరు ప్రీరిలీజ్ ఈవెంట్
  • చీఫ్ గెస్ట్ గా చిరంజీవి
  • జనవరి 11న రిలీజవుతున్న చిత్రం

మహేశ్ బాబు, రష్మిక మందన్న జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న సరిలేరు నీకెవ్వరు చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈ సాయంత్రం హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వస్తుండడంతో ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు మరింత హైప్ ఏర్పడింది. మెగాస్టార్, సూపర్ స్టార్ కలిసి పాల్గొంటున్న ఈ వెంట్ కావడంతో మీడియా కూడా భారీగా దృష్టి సారించింది.

అటు మెగా అభిమానులు, ఇటు మహేశ్ బాబు ఫ్యాన్స్ సందడి చేస్తుండడంతో ఎల్బీ స్టేడియం కోలాహలంగా మారింది. ప్రీరిలీజ్ ఈవెంట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో తమన్నా పెర్ఫామ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. స్టేడియానికి చేరుకున్న మిల్కీబ్యూటీ రిహార్సల్స్ చేస్తూ బిజీగా కనిపించింది.

  • Loading...

More Telugu News