Mahesh Babu: 'సరిలేరు నీకెవ్వరు' ప్రభావం... హైదరాబాద్ లో పోలీస్ రూల్స్!

  • నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్
  • సాయంత్రం నుంచి రాత్రి వరకూ ఆంక్షలు
  • చుట్టుపక్కల ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపు

నేటి సాయంత్రం హైదరాబాద్ లోని ఎల్ బీ స్టేడియంలో మహేశ్ బాబు తాజా చిత్రం 'సరిలేరు నీకెవ్వరు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్న నేపథ్యంలో పోలీసులు వాహనదారులు, ప్రజలపై ఆంక్షలను విధించారు. ఈ కార్యక్రమానికి వీఐపీలు, ప్రముఖ సెలబ్రిటీలు హాజరు కానుండగా, ఆదివారం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు. ఎల్ బీ స్టేడియం పరిసరాల్లో ఇవి అమలులో ఉంటాయని తెలిపారు.

ఏఆర్‌ పెట్రోల్‌ పంప్‌ వైపు వైపు నుంచి వచ్చేవాహనాలను నాంపల్లివైపు మళ్లిస్తామని, ఆబిడ్స్‌ నుంచి వచ్చే వాహనాలను గన్‌ ఫౌండ్రీ మీదుగా మళ్లిస్తామని, ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ నుంచి వచ్చే వాహనదారులు బషీర్‌ బాగ్‌ మీదుగా హిమాయత్‌ నగర్‌ వైపు వెళ్లాలని సూచించారు. ఇక కింగ్‌ కోఠి వైపు నుంచి వచ్చే వాహనాలను ఈడెన్‌ గార్డెన్‌ వైపు మళ్లిస్తామని, లిబర్టీ నుంచి వచ్చే వాహనాలను హిమాయత్‌ నగర్‌ వైపు మళ్లిస్తామని తెలిపారు. రవీంద్ర భారతి నుంచి వచ్చే వాహనాలు నాంపల్లి వైపు వెళ్లాలని, వాహన రద్దీని తగ్గించాలనే ఈ ఆంక్షలను అమలు చేస్తున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News