Devineni Uma: దేవినేని ఉమ నిరసన దీక్ష విరమణ

  • నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేసిన రైతులు
  • రైతులకు మద్దతు తెలుపుతూ దేవినేని గొల్లపూడిలో దీక్ష
  • రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలన్న దేవినేని  
అమరావతిని రాజధానిగా కొనసాగించాలంటూ టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చేపట్టిన 24 గంటల దీక్షను విరమించారు. రాజధానిపై ఆందోళన చేపట్టిన రైతులకు మద్దతు తెలుపుతూ దేవినేని గొల్లపూడిలో దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ రోజు మధ్యాహ్నం పలువురు రైతులు నిమ్మరసం ఇచ్చి దేవినేని ఉమా దీక్షను విరమింపజేశారు.

ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ.. రైతుల ఆందోళనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. రాజధానికోసం రైతులు స్వచ్ఛందంగా  భూములిచ్చారని పేర్కొన్నారు. తమ భూములను త్యాగం చేసిన రైతులనుద్దేశించి మంత్రులు హీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజధానిపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని దేవినేని డిమాండ్ చేశారు.
Devineni Uma
supporting farmers
Amaravathi

More Telugu News