Anupama Parameshvaran: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

  • అనుపమకు తెలుగులో మరో సినిమా 
  • వెంకటేశ్ వరుస సినిమాల ప్లానింగ్ 
  • షూటింగుకి సిద్ధమవుతున్న చిరంజీవి 

  *  మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ త్వరలో నిఖిల్ సరసన కథానాయికగా నటించనుంది. గతంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రానికి నిఖిల్ ఇప్పుడు సీక్వెల్ చేస్తున్నాడు. చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కథానాయికగా అనుపమను తీసుకున్నట్టు సమాచారం.
*  'వెంకీమామ' తర్వాత సీనియర్ నటుడు వెంకటేశ్ 'అసురన్' రీమేక్ లో నటిస్తున్నాడు. జనవరి నుంచి దీని రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఆ చిత్రం తర్వాత త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో వెంకీ ఓ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన కథను దర్శకుడు త్రినాథరావు సిద్ధం చేస్తున్నాడట.
*  చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందే చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 26 నుంచి హైదరాబాదులో జరుగుతుంది. రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష కథానాయికగా నటిస్తుంది.  

More Telugu News