Gujarath: ఆలస్యంగా వచ్చిన అంబులెన్స్... గుజరాత్ సీఎం బంధువు మృతి!

  • గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఘటన
  • విజయ్ రూపానీకి వరుసకు సోదరుడయ్యే అనిల్ సింఘ్వీ
  • అంబులెన్స్ సమయానికి రాక మృతి

అంబులెన్స్ రావడం ఆలస్యం కావడంతో, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీకి వరుసకు సోదరుడు అయ్యే అనిల్ సింఘ్వీ మరణించారు. ఈ ఘటన రాష్ట్రంలోని రాజ్ కోట్ లో జరిగింది. అనిల్ అస్వస్థతకు గురి కావడంతో కుటుంబీకులు 108కు ఫోన్ చేశారు.

అయితే, అంబులెన్స్ సిబ్బంది పొరపాటున, వెళ్లాల్సిన చోటుకు వెళ్లకుండా మరో చోటుకు వెళ్లారు. తప్పు తెలుసుకుని వెనక్కు వచ్చేసరికి దాదాపు 41 నిమిషాలు ఆలస్యం అయింది. చికిత్స ఆలస్యమై అనిల్ సింఘ్వీ కన్నుమూశారు. అంబులెన్స్ సకాలంలో వచ్చివుంటే ఆయన బతికి ఉండేవారని తెలుస్తోంది.

ఇక ఈ ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించగా, రాజ్ కోట్ కలెక్టర్ విచారణ జరుపుతున్నారు. అనిల్ ను కోల్పోవడం తనకు వ్యక్తిగతంగా ఎంతో లోటని సీఎం విజయ్ రూపానీ వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన ఆదేశించారు.

  • Loading...

More Telugu News