Vizag Test: మొదటి సెషన్ లో టీమిండియాదే పైచేయి.. హాఫ్ సెంచరీతో అదరగొట్టిన రోహిత్ శర్మ

  • భారత్ కు శుభారంభాన్ని ఇచ్చిన ఓపెనర్లు
  • లంచ్ విరామ సమయానికి 91 పరుగులు చేసిన టీమిండియా
  • రోహిత్ 52, మయాంక్ అగర్వాల్ 39 పరుగులు
విశాఖలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టుల్లో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్ శుభారంభాన్ని ఇచ్చారు. లంచ్ విరామ సమయానికి 30 ఓవర్లలో భారత్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 91 పరుగులు చేసింది. రోహిత్ శర్మ 52 (84 బంతులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), మయాంక్ అగర్వాల్ 39 (96 బంతులు, 6 ఫోర్లు) పరుగులు చేసి దక్షిణాఫ్రికా బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. వీరిద్దరూ ఇలాగే చెలరేగితే తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ స్కోరు సాధించడం ఖాయం.
Vizag Test
India
South Africa
Score

More Telugu News