Srikakulam District: మూల విరాట్‌ను తాకని సూర్యకిరణాలు.. అరసవిల్లిలో భక్తుల నిరాశ

  • నేడు స్వామి వారి పాదాలను స్పృశించని కిరణాలు
  • నిరాశగా వెనుదిరిగిన భక్తులు
  • రేపటిపైనే ఆశ
శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి సూర్యనారాయణస్వామి భక్తులు నేడు తీవ్ర నిరాశకు గురయ్యారు. నేడు స్వామి వారి మూలవిరాట్‌ను తాకాల్సిన సూర్యకిరణాలు మేఘాల కారణంగా ప్రసరించలేదు. దీంతో ఈ అపురూప దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఆకాశం మేఘావృతమైంది. దీంతో భానుడి కిరణాలు స్వామి వారి పాదాలను తాకలేకపోయాయి. రేపు కూడా సూర్యుడి కిరణాలు స్వామి వారి మూలవిరాట్‌ను తాకుతాయి. అయితే, ఇందుకు వాతావరణం కరుణించాల్సి ఉంటుంది.
Srikakulam District
arasavilli
lord suryanarayana

More Telugu News