Vantha Rajavathaan Varuven: ‘అత్తారింటికి దారేది’ రీమేక్‌తో భారీగా నష్టపోయిన ‘లైకా’.. అధికారిక ప్రకటన

  • ‘వందా రాజావాదన్ వేరువేన్’ పేరుతో రీమేక్
  • బాక్సాఫీసు వద్ద బోల్తా 
  • రూ.14 కోట్లు నష్టపోయినట్టు ప్రకటించిన నిర్మాణ సంస్థ
తెలుగులో పవన్ కల్యాణ్ నటించిన ‘అత్తారింటికి దారేది’ సినిమా ఘన విజయం సాధించింది. ఈ సినిమాను తమిళంలో ‘వందా రాజావాదన్ వరువేన్’ పేరుతో శింబు హీరోగా లైకా సంస్థ రీమేక్ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. దీంతో నిర్మాణ సంస్థ భారీ నష్టాలను మూటగట్టుకుంది. ‘అత్తారింటికి దారేది’ సినిమా రీమేక్ ద్వారా ఏకంగా రూ.14 కోట్ల నష్టం వచ్చినట్టు లైకా సంస్థ అధికారికంగా ప్రకటించడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది. గతంలో ఎన్నడూ ఇలా నష్టాలను అధికారికంగా ప్రకటించిన దాఖలాలు లేకపోవడంతో చర్చకు కారణమైంది.
Vantha Rajavathaan Varuven
Simbu
Catherine Tresa
Lyca Productions

More Telugu News