Hyderabad: రసూల్ పురా ‘మెట్రో’ పైకప్పు పెచ్చులూడాయి!

  • ఇక్కడా అమీర్ పేట ‘మెట్రో’ పైకప్పు పరిస్థితే
  • భయాందోళనలకు గురవుతున్న ప్రయాణికులు
  • మెట్రో అధికారులు తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్
అమీర్ పేట మెట్రో రైల్వేస్టేషన్ ఆవరణలో పైకప్పు పెచ్చులూడిన ఘటనలో యువ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నిన్న మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన మరువకముందే మరో మెట్రో స్టేషన్ పైకప్పు పరిస్థితి ఇదేమాదిరి ఉంది. రసూల్ పురా మెట్రోస్టేషన్ పైకప్పు పెచ్చులూడే దశలో ఉంది. దీంతో, ప్రయాణికులు భయాందోళనలకు గురవుతున్నారు. దీనిపై మెట్రో అధికారులు స్పందించి తక్షణం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

Hyderabad
Metro Rail
Rasulpura

More Telugu News