chandragiri: ముగిసిన మాజీ ఎంపీ శివప్రసాద్ అంత్యక్రియలు

  • చంద్రగిరికి సమీపంలోని అగరాలలో అంత్యక్రియలు
  • శివప్రసాద్ భౌతికకాయం ఖననం
  • శివప్రసాద్ కు కడసారి వీడ్కోలు పలికిన టీడీపీ నేతలు
అనారోగ్యంతో మృతి చెందిన టీడీపీ మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. చంద్రగిరికి సమీపంలోని అగరాలలో శివప్రసాద్ భౌతికకాయాన్ని ఖననం చేశారు. అంత్యక్రియల్లో ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కరరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు, తిరుపతి ఎన్జీవో కాలనీ నుంచి చంద్రగిరి సమీపంలోని అగరాల వరకు అంతిమయాత్ర నిర్వహించారు. శివప్రసాద్ కు జిల్లా నేతలు, అభిమానులు కడసారి వీడ్కోలు పలికారు.
chandragiri
N.sivaprasad
Telugudesam
chevireddy

More Telugu News