chitoor: శివప్రసాద్ స్మారకంగా మెమోరియల్ పార్క్ ఏర్పాటుకు కృషి: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి

  • తిరుపతిలోని నివాసంలో శివప్రసాద్ పార్థివదేహం
  • నివాళులర్పించిన చెవిరెడ్డి, అమర్ నాథ్ రెడ్డి
  • శివప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలి
చిత్తూరు మాజీ ఎంపీ ఎన్. శివప్రసాద్ స్మారకంగా మెమోరియల్ పార్క్ ఏర్పాటుకు కృషి చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని నివాసంలో శివప్రసాద్ పార్థివదేహానికి వైసీపీ నేతలు చెవిరెడ్డి, అమర్ నాథ్ రెడ్డి లు నివాళులర్పించారు. శివప్రసాద్ కుటుంబసభ్యులను పరామర్శించారు. చిత్తూరు జిల్లా నేతలంతా కలిసి శివప్రసాద్ మెమోరియల్ పార్క్ కోసం కృషి చేస్తామని చెప్పారు. శివప్రసాద్ ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
chitoor
Telugudesam
sivaprasad
chevi reddy

More Telugu News