Chittoor District: మాజీ ఎంపీ శివప్రసాద్‌కు సర్కారు లాంఛనాలతో అంతిమ సంస్కారం

  • చంద్రగిరి మండలం అగరాలలో అంత్యక్రియలు
  • సాయంత్రం 4 గంటలకు ప్రారంభంకానున్న అంతిమ యాత్ర
  • యాత్రలో పాల్గొననున్న టీడీపీ అధినేత చంద్రబాబు
చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు నారమల్లి శివప్రసాద్‌ అంతిమ సంస్కారం ప్రభుత్వ లాంచనాలతో నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. శివప్రసాద్ మృతితో పార్టీ శ్రేణులు, అభిమానులు విషాదంలో మునిగిపోయిన విషయం తెలిసిందే. అభిమాన నేతను కడసారి చూసుకునేందుకు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి తరలివస్తున్నారు.

రాజకీయ, సినీరంగంలో తనదైన ముద్ర వేసిన ఎంపీ శివప్రసాద్  కిడ్నీ సంబంధిత వ్యాధితో చెన్నైలో చికిత్స పొందుతూ నిన్న మధ్యాహ్నం కన్నుమూశారు. చంద్రగిరి మండలం అగరాలలో ఇవాళ శివప్రసాద్ అంత్యక్రియలు జరగనున్నాయి. తిరుపతి ఎన్జీవోస్ కాలనీలోని నివాసం నుంచి  సాయంత్రం 4 గంటలకు అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. శివప్రసాద్‌ అంతిమయాత్రలో తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పాల్గొననున్నారు.
Chittoor District
Ex.MP sivaprasad
gove.funeral

More Telugu News