kodela: కోడెల అంత్యక్రియలు పూర్తి.. శివరామ్ కన్నీరుమున్నీరు!

  • నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు
  • తండ్రి చితికి నిప్పంటించిన కొడుకు శివరామ్
  • కన్నీరుమున్నీరైన కోడెల కుటుంబసభ్యులు, పార్టీ నేతలు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ముగిశాయి. నరసరావుపేటలోని స్వర్గపురిలో కోడెల అంత్యక్రియలు నిర్వహించారు. కోడెల చితికి ఆయన తనయుడు శివరామ్ నిప్పు అంటించారు. తండ్రి మృతదేహానికి కొరివి పెడుతూ శివరామ్ కన్నీరుమున్నీరుగా విలపించారు.

అంతకుముందు, నరసరావుపేటలోని కోడెల నివాసం నుంచి ఆయన అంతిమ యాత్ర మూడు కిలోమీటర్ల మేర సాగి ‘స్వర్గపురి’ని చేరుకుంది. కోడెల అంత్యక్రియల కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు సహా పద్నాలుగు మంది మాజీ మంత్రులు, ముగ్గురు ఎంపీలు, పదిహేను మంది ఎమ్మెల్యేలు, ఇరవై మంది ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ అంతిమయాత్రలో చంద్రబాబు సహా నేతలందరూ మూడు కిలోమీటర్లు నడిచారు. గుంటూరుతో పాటు కృష్ణా, ప్రకాశం జిల్లాల నుంచి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు.
kodela
sivaprasad
sivaram
Telugudesam

More Telugu News