Kodela: గుంటూరు చేరుకున్న కోడెల భౌతికకాయం

  • ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన కోడెల
  • హైదరాబాద్ నుంచి గుంటూరుకు భౌతికకాయం తరలింపు
  • టీడీపీ రాష్ట్ర కార్యాలయం నుంచి అంతిమయాత్ర ప్రారంభం
టీడీపీ అగ్రనేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో విషాదం నింపింది. ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ నుంచి ఈ ఉదయం గుంటూరు తరలించారు. కొద్దిసేపటి క్రితమే కోడెల పార్థివదేహం గుంటూరు చేరుకుంది. అభిమానులు, కార్యకర్తల సందర్శనార్థం భౌతికకాయాన్ని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఉంచనున్నారు.

అనంతరం, రాత్రి 7.30 గంటలకు అంతిమయాత్ర ప్రారంభం కానుంది. టీడీపీ కార్యాలయం నుంచి ప్రారంభం కానున్న అంతిమయాత్ర పేరేచర్ల, మేడికొండూరు, కొర్రపాడు మీదుగా సత్తెనపల్లి వరకు కొనసాగనుంది. అక్కడి నుంచి ముప్పాళ్ల మీదుగా ఆయన స్వస్థలం నరసరావుపేట చేరుకుంటుంది. కోడెల అంత్యక్రియలు రేపు నరసరావుపేటలో నిర్వహిస్తారు.
Kodela
Telugudesam
Andhra Pradesh
Guntur
Hyderabad

More Telugu News