Kodela: మా సార్ మేడపైకి ఎక్కుతుంటే చూశాను... అది నైలాన్ తాడు: కోడెల గన్ మెన్ ఆదామ్

  • నిన్న ఆత్మహత్య చేసుకున్న కోడెల
  • 9.30 గంటల సమయంలో మేడపైకి
  • నైలాన్ తాడుతో ఉరేసుకున్న కోడెల

ఇటీవల హైదరాబాద్ లోని తన ఇంటికి వచ్చిన ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్, నిన్న అనూహ్యరీతిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. కోడెల మృతిపై ఆయన గన్ మెన్ ఆదామ్ స్పందించారు. ఓ టీవీ చానెల్ తో మాట్లాడిన ఆయన, సోమవారం ఉదయాన్నే తాను కోడెల సార్ ఇంటికి వెళ్లానని అన్నారు.

సుమారు 9.30 గంటల సమయంలో ఆయన, ఇంట్లోని తొలి అంతస్తుకు వెళ్లేందుకు మెట్లు ఎక్కారని, కోడెల ఫస్ట్‌ ఫ్లోర్‌ కు వెళ్లడాన్ని తాను చూశానని అన్నారు. ఆపై 11 గంటల సమయంలో కోడెల కుమార్తె విజయలక్ష్మి మేడ మీదికి వెళ్లారని చెప్పారు. ఆపై 5 నిమిషాల వ్యవధిలోనే తనను పిలిచారని, సార్‌ ఉన్న గది తలుపులు తెరుచుకోకపోవడంతో, కిటికీ గేట్‌ నుంచి లోపలికి ప్రవేశించానని అన్నారు. నైలాన్‌ తాడుతో ఫ్యాన్‌ కు ఉరివేసుకున్న స్థితిలో కోడెల సార్‌ కనిపించారని, ఆయన్ను తానే కిందకు దింపానని అన్నారు. ఆ వెంటనే సార్ ను ఆసుపత్రికి తీసుకెళ్లామని చెప్పారు.

More Telugu News