Telangana: ట్యాంక్ బండ్ నుంచి ఇస్మార్ట్ సత్తి రిపోర్టింగ్.. రౌండప్ చేసి పక్కకు తీసుకెళ్లిన పోలీసులు!

  • మరికాసేపట్లో గణేశ్ నిమజ్జనం
  • హుస్సేన్ సాగర్ వద్దకు టీవీ9 టీమ్
  • తనను పోలీసులు ఫార్సలింగ్ చేస్తున్నారని వ్యాఖ్య
ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహం హుస్సేన్ సాగర్ కు సమీపంలోని క్రేన్ నెంబర్ 6 వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిమజ్జనం జరిపేందుకు పోలీసులు, స్థానిక అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే గణేశుడు చేరుకోవడానికి కొద్దిసేపటి ముందు హుస్సేన్ సాగర్ వద్ద ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. టీవీ9 ప్రతినిధి ఇస్మార్ట్ సత్తి హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ చేరుకుని లైవ్ రిపోర్టింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు.

దీంతో ఒక్కసారిగా అక్కడికి భారీగా పోలీసులు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇన్ స్పెక్టర్ సైదిరెడ్డి మాట్లాడుతూ..‘సార్.. మీరు ఇక్కడుంటే పబ్లిక్ ను కంట్రోల్ చేయడం కష్టం. మీరు మాతో రండి’ అంటూ పక్కకు తీసుకెళ్లిపోయారు. దీంతో తాను ఇక తిరిగిరాననీ, పోలీసులు తనను ఎక్కడికో ఫార్సలింగ్(పార్సిల్) చేయబోతున్నారని సత్తి నవ్వులు పూయించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.
Telangana
Hyderabad
ganesh immerson
Hussian sagar
ISMART SATTI
REPORTING

More Telugu News