India: రిజర్వు బ్యాంకు నుంచి తీసుకునే రూ.1.76 లక్షల కోట్లను ఏం చేస్తామో చెప్పిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్!

  • బ్యాంకులకు రూ.70,000 కోట్ల మూలధన సాయం
  • ఐటీ రిటర్నుల్లో ఆధార్ లేదా పాన్ ఉన్నా ఓకే
  • ఎయిరిండియా వంటి సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ

భారత ఆర్థిక రంగం, బ్యాంకింగ్ వ్యవస్థలను పటిష్టం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటోందని కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఇందులో భాగంగా బ్యాంకులకు మూలధనంగా రూ.70,000 కోట్లను కేటాయించామని చెప్పారు. అంతర్జాతీయ మందగమనం నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా భారతీయ రిజర్వు బ్యాంకు(ఆర్బీఐ) రూ.1.76 లక్షల కోట్ల మిగులు నిధులను బ్యాంకులకు అందించబోతోందని పేర్కొన్నారు.

మోదీ ప్రభుత్వం 100 రోజుల పాలన అభివృద్ధి, సంక్షేమం దిశగా సాగుతోందని కితాబిచ్చారు. అలాగే పన్నుచెల్లింపుదారులకు ఊరట కల్పించేలా ఐటీ రిటర్నుల సమయంలో ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు ఉంటే సరిపోయేలా నిబంధనలను సవరించామని మంత్రి ఠాకూర్ గుర్తుచేశారు. అలాగే నష్టాల్లో నడుస్తున్న ఎయిరిండియా వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మకంగా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ చేపడుతున్నామనీ, తద్వారా వీటిని లాభాల బాటలోకి మళ్లించేందుకు కృషి చేస్తున్నామని ఠాకూర్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News