Jagan: ప్రతి కుటుంబానికి విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలి... ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

  • రేపు వినాయక చవితి పర్వదినం
  • అభివృద్ధికి అన్ని విఘ్నాలు తొలగిపోవాలని ఆకాంక్ష
  • ప్రతి ఇంట్లోనూ సుఖసంతోషాలు నిండాలంటూ కోరుకుంటున్నట్టు వెల్లడి
ఏపీ ప్రజలకు సీఎం జగన్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమానికి విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా శుభాలు, విజయాలు కలగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ప్రతి కుటుంబంలోనూ సుఖసంతోషాలు నిండేలా విఘ్నేశ్వరుడి దీవెనలు లభించాలని జగన్ అభిలషించారు.
Jagan
Vinayaka Chavithi
Andhra Pradesh
YSRCP

More Telugu News