Amit Shah: వాజ్‌పేయి నివాసం వున్న ఇంట్లోకి మారిన అమిత్ షా!

  • ఆగస్టు 15న గృహ ప్రవేశ వేడుకను నిర్వహించిన మంత్రి
  • మంగళవారం అధికారికంగా ఇంట్లోకి 
  • నివాసాలు ఖాళీ చేయని ఎంపీల భవనాలకు విద్యుత్, నీటి సరఫరా బంద్
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గతేడాది మరణించిన తర్వాత ఆయన నివసించిన ఢిల్లీలోని కృష్ణ మార్గ్‌లో ఉన్న భవనం ఖాళీగా ఉంటోంది. ఇటీవల ఆ భవనాన్ని కేంద్రమంత్రి అమిత్ షాకు కేటాయించారు. ఈ నెల 15న గృహ ప్రవేశ వేడుకను నిర్వహించిన అమిత్ షా.. నేడు ఆ ఇంట్లోకి మారారు.  ఇప్పటి వరకు ఆయన అక్బర్ రోడ్డులోని బంగ్లాలో ఉండేవారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అమిత్ షా.. ఎన్‌డీయే ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత హోంశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో వాజ్‌పేయి నివసించిన భవనాన్ని ప్రభుత్వం ఆయనకు కేటాయించింది. ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయని ఎంపీల నివాసాల్లో విద్యుత్, నీటి సరఫరాను ప్రభుత్వం నిలిపివేసింది. ఏడు రోజుల్లోనే వాటిని ఖాళీ చేయాలని ఆదేశించింది.
Amit Shah
vajpayee
bangla
New Delhi

More Telugu News