యాషెస్ లో బెన్ స్టోక్స్ అద్భుతం... తనకో చెల్లెలు ఉంటే స్టోక్స్ కు ఇచ్చి పెళ్లి చేసేవాడ్నంటూ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

యాషెస్ లో బెన్ స్టోక్స్ అద్భుతం... తనకో చెల్లెలు ఉంటే స్టోక్స్ కు ఇచ్చి పెళ్లి చేసేవాడ్నంటూ మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు

  • లీడ్స్ టెస్టులో స్టోక్స్ సూపర్ ఇన్నింగ్స్
  • ఒక్క వికెట్ తేడాతో ఇంగ్లాండ్ చిరస్మరణీయ విజయం
  • స్టోక్స్ పై అభినందనల వెల్లువ
టెస్టు క్రికెట్ లో సెకండ్ ఇన్నింగ్స్ లో 300 పైచిలుకు స్కోర్లను ఛేదించడం ఎంతో కష్టసాధ్యంగా భావిస్తుంటారు. పిచ్ బాగా నలిగిపోయి ఉన్న స్థితిలో బంతి ఎటువైపు వస్తుందో అంచనా వేయడం ఏమంత సులభం కాదు. కానీ, యాషెస్ సిరీస్ లో ఇంగ్లాండ్ జట్టు అసాధ్యాన్ని సుసాధ్యం చేసిందంటే అందుకు ప్రధాన కారకుడు బెన్ స్టోక్స్. లీడ్స్ టెస్టులో ఈ ఆల్ రౌండర్ ఆడిన అద్వితీయ ఇన్నింగ్స్ తో ఇంగ్లాండ్ జట్టు తన చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై చిరస్మరణీయ విజయం సాధించింది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన స్టోక్స్ ఇప్పుడు ఇంగ్లాండ్ లో సూపర్ హీరో అయిపోయాడు.

ఇటీవలే వన్డే ప్రపంచకప్ గెలవడంలోనూ ప్రధానభూమిక పోషించిన స్టోక్స్ మరోసారి అదే తరహా పోరాట పటిమ కనబర్చడంతో అందరూ అతడి అభిమానులైపోయారు. తాజాగా, ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ గ్రేమ్ స్వాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టోక్స్ ఆడిన ఆటకు తాను ఫిదా అయ్యానని, దురదృష్టవశాత్తు తనకు అక్కాచెల్లెళ్లు ఎవరూ లేరని, ఉంటే మాత్రం స్టోక్స్ కు ఇచ్చి పెళ్లి చేసేవాడ్నని తెలిపాడు. దీనిపై ట్విట్టర్ లో జోకులు పేలుతున్నాయి. అక్కాచెల్లెళ్లు లేరంటున్నావు కాబట్టి, ఎవరో ఎందుకు, నువ్వే స్టోక్స్ ను పెళ్లి చేసుకోరాదూ అంటూ స్వాన్ పై సెటైర్లు వేస్తున్నారు.
Ben Stokes
Graeme Swann
England
Australia

More Telugu News