Allu Arjun: రేపు ఉదయం త్రివిక్రమ్ సినిమా టైటిల్ పోస్టర్ విడుదల

  • షూటింగు దశలో త్రివిక్రమ్ మూవీ 
  • ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సాగే కథ
  •  నాయికలుగా పూజా హెగ్డే - నివేదా పేతురాజ్

త్రివిక్రమ్ తాజా చిత్రంగా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ రూపొందుతోంది. అల్లు అర్జున్ - పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఎక్కువ అనే టాక్ కొన్ని రోజులుగా వినిపిస్తోంది. ఈ సినిమాకి 'నేను - నాన్న' .. 'వైకుంఠపురంలో' అనే టైటిల్స్ పరిశీలనలో వున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ఏమిటనేది ఆగస్టు 15న రివీల్ చేస్తామని నిన్న త్రివిక్రమ్ తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తాజాగా టైటిల్ పోస్టర్ రిలీజ్ కి ముహూర్తాన్ని ఖాయం చేసేశారు. రేపు ఉదయం 11 గంటల 7 నిమిషాలకి టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయనున్నట్టు గీతా ఆర్ట్స్ వారు ప్రకటించారు. గీతా ఆర్ట్స్ తో పాటు హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. నివేదా పేతురాజ్ మరో కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాను, సంక్రాంతికి విడుదల చేయనున్నారు.

  • Loading...

More Telugu News