Pawan Kalyan: ముస్లిం మతం పాటించే భారతీయులకు బక్రీద్ ఆంతర్యం లక్ష్యం కావాలి: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
ముస్లింలకు పవిత్రమైన బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన అధిపతి పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ముస్లిం సోదరసోదరీమణులందరికీ జనసేన తరఫున కూడా విషెస్ తెలియజేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. బక్రీద్ పర్వదినం త్యాగనిరతికి ప్రతీక అని పవన్ పేర్కొన్నారు. కోరికలు, స్వార్థం, రాగద్వేషాలకు దూరంగా ఉంటూ మానవత్వమే పరమావధిగా మసలుకోవాలన్నదే బక్రీద్ అంతర్యమని, దీన్ని ముస్లిం మతం పాటించే భారతీయులు లక్ష్యంగా చేసుకోవాలని ఆకాంక్షించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Jana Sena
Bakrid

More Telugu News