banks: వరుసగా మూడు రోజులు మూతపడనున్న బ్యాంకులు.. సేవలకు అంతరాయం!

  • సెలవు రోజుల్లో నెఫ్ట్, ఆర్టీజీఎస్ సేవలకు అంతరాయం
  • నగదు లేక వెలవెలబోనున్న ఏటీఎంలు
  • రెండో వారంలో బ్యాంకులు పనిచేసేది నాలుగు రోజులే

సెలవుల కారణంగా ఈ నెల 10 నుంచి వరుసగా మూడు రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 10వ తేదీ రెండో శనివారం సెలవు కాగా, 11 ఆదివారం 12న బక్రీదు కావడంతో బ్యాంకులు మళ్లీ మంగళవారం తెరుచుకోనున్నాయి. అయితే, స్వాతంత్ర్య దినోత్సవం కావడంతో 15న మళ్లీ సెలవు. ఫలితంగా ఆ వారంలో నాలుగు రోజులు మాత్రమే బ్యాంకు సేవలు లభించనున్నాయి.

సెలవు రోజుల్లో  నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌ వంటి ఆన్‌లైన్‌ సేవలకు కూడా అంతరాయం కలిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే, వరుస సెలవుల కారణంగా నగదు లేక ఏటీఎంలు కూడా బోసిపోయే అవకాశం ఉంది. వినియోగదారులు ఇబ్బందులు పడకుండా ఏటీఎంలలో పూర్తిస్థాయిలో నగదు నింపే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News