Karnataka: సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయినందుకు విచారించడం లేదు: దేవెగౌడ స్పందన

  • ఓటమి విషయమై ఎవరినీ నిందించదలచుకోలేదు
  • ఎవరినీ తప్పుబట్టడం లేదు
  • సీఎంగా కుమారస్వామి కష్టపడి పని చేశారు

కర్ణాటకలో నిన్నటి విశ్వాస పరీక్షలో బల నిరూపణ చేసుకోలేకపోయిన సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన విషయం తెలిసిందే. దీనిపై జేడీఎస్ అధినేత దేవెగౌడ స్పందిస్తూ, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు కానీ, ప్రభుత్వం కూలిపోయినందుకు గానీ తాము విచారించడం లేదని వ్యాఖ్యానించారు. విశ్వాసపరీక్షలో సంకీర్ణ ప్రభుత్వం ఓటమి విషయమై ఎవరినీ నిందించదలచుకోలేదని, తప్పుబట్టడం లేదని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిగా కుమారస్వామి తన శక్తివంచన లేకుండా కష్టపడ్డారని, ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు పాటుపడ్డారని అన్నారు.

Karnataka
jds
Devegowda
kumara swamy
  • Loading...

More Telugu News