Andhra Pradesh: 6 రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించిన కేంద్ర ప్రభుత్వం!

  • ఇటీవల ఏపీ గవర్నర్ గా హరిచందన్ నియామకం
  • యూపీ గవర్నర్ గా ఆనందీబెన్ పటేల్
  • మధ్యప్రదేశ్ గవర్నర్ గా లాల్జీటాండన్ నియామకం

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ను ఇటీవల నియమించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరిన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఉత్తరప్రదేశ్ గవర్నర్ గా బీజేపీ నేత, గుజరాత్ మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్ ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీచేసింది.

ఇక పశ్చిమబెంగాల్ గవర్నర్ గా జగదీప్ ధన్ఖర్, త్రిపుర గవర్నర్ గా రమేశ్ బయాస్, నాగాలాండ్ గవర్నర్ గా ఆర్ఎన్ రవిని నియమిస్తున్నట్లు తెలిపింది.అలాగే బిహార్ గవర్నర్ గా పగూ చౌహాన్, మధ్యప్రదేశ్ గవర్నర్ గా లాల్జీ టాండన్ ను నియమిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్ గా ఉన్న ఆనందీబెన్ పటేల్ ఉత్తరప్రదేశ్ కు బదిలీపై వెళుతున్నారు.

Andhra Pradesh
6 governers
appointed
West Bengal
Madhya Pradesh
nagaland
bihar
Tripura
  • Loading...

More Telugu News