pulivendula: వివేకా హత్య కేసు...గంగిరెడ్డి విషయంలో నేడు కోర్టు నిర్ణయం

  • నార్కోఅనాలసిస్‌ పరీక్షలకు అనుమతి కోరుతూ పోలీసుల పిటిషన్‌
  • ఈరోజు వెల్లడించనున్న న్యాయమూర్తి
  • ఇప్పటికే వాచ్‌మెన్‌ రంగన్న, కిరాయి హంతకుడు శేఖర్‌రెడ్డి పరీక్షలకు అనుమతి
ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి బాబాయి, మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో కోర్టు ఈరోజు ముఖ్యమైన నిర్ణయాన్ని వెలువరించనుంది. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు వివేకా ముఖ్య అనుచరుడైన గంగిరెడ్డికి నార్కోఅనాలసిస్‌ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించాలంటూ పులివెందుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ ఈరోజు విచారణకు రానుంది. వాచ్‌మెన్‌ రంగన్న, కిరాయి హంతకుడు శేఖర్‌రెడ్డిలకు నార్కోఅనాలసిస్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే అనుమతించిన కోర్టు గంగిరెడ్డి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. వివేకా హత్య విషయంలో భిన్నమైన కారణాలు వినిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
pulivendula
viveka murder case
narcoanalsis tests
viveka follower gangireddy

More Telugu News