Amma Odi: 'అమ్మ ఒడి' అమలు వచ్చే ఏడాదే: స్పష్టతనిచ్చిన జగన్ సర్కారు

  • 2020 జనవరి 26న పథకం ప్రారంభం
  • స్కూళ్లు, జూనియర్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులకు వర్తింపు
  • అసెంబ్లీలో వెల్లడించిన ఏపీ విద్యాశాఖ మంత్రి

పాఠశాలలకు, కాలేజీలకు తన పిల్లల్ని పంపే ప్రతి తల్లికి రూ.15 వేలు ఇచ్చేందుకు ఉద్దేశించిన 'అమ్మ ఒడి' పథకంపై ఏపీ ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. ఈ పథకం వచ్చే ఏడాది జనవరి 26 నుంచి అమల్లోకి వస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు మాత్రమే కాకుండా, ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా 'అమ్మ ఒడి' పథకంతో లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. అర్హులైన తల్లులకు ఈ పథకంలో భాగంగా రూ.15 వేలు ఇస్తామని వివరించారు. ఈ మేరకు మంత్రి అసెంబ్లీలో వెల్లడించారు.

More Telugu News