BHEL: ప్రభుత్వ రంగ సంస్థ బీహెచ్ఈఎల్ సీఎండీగా నళిన్ సింఘాల్ నియామకం

  • ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటన
  • ఈ పదవిలో ఐదేళ్ల పాటు కొనసాగుతారని సమాచారం
  • గతంలో వివిధ బాధ్యతలు నిర్వహించిన సింఘాల్
ప్రభుత్వ రంగ సంస్థ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ఈఎల్) చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా డాక్టర్ నళిన్ సింఘాల్ ను నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సీఎండీగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారని పేర్కొంది. ఐదేళ్ల పాటు ఈ పదవిలో ఆయన కొనసాగుతారని సమాచారం. కాగా, ఐఐటీ ఢిల్లీ నుంచి ఎలక్ట్రానిక్స్ లో బీటెక్ డిగ్రీ, ఐఐఎం కోల్ కతాలో పీజీడీఎం పూర్తి చేశారు. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కు సీఎండీగా వ్యవహరించారు. ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీసు, ఐఆర్సీటీసీ, సీఈఎల్ లో విభిన్న బాధ్యతలను నిర్వహించారు.   
BHEL
CMD
Nalin singhal
central Govenment

More Telugu News