Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్ గాంధీకి బెయిల్... కీలక వ్యాఖ్యలు

  • నాపై దాడి జరుగుతోంది.. పోరాటాన్ని ఎంజాయ్ చేస్తున్నా
  • గతంలో కంటే 10 రెట్లు ఎక్కువగా పోరాడతా
  • కోర్టులో తానేమీ మాట్లాడలేదన్న రాహుల్

పరువునష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీకి ముంబైలోని ఓ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ. 15,000 పూచీకత్తుపై బెయిల్ ఇచ్చింది. మాజీ ఎంపీ ఏక్ నాథ్ గైక్వాడ్ షూరిటీ ఇచ్చారు. జర్నలిస్ట్ గౌరీ లంకేశ్ హత్య గురించి గతంలో రాహుల్ మాట్లాడుతూ, బీజేపీ, ఆరెస్సెస్ సిద్ధాంతాలే హత్యకు కారణమని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాహుల్ పై ఓ ఆరెస్సెస్ కార్యకర్త పరువునష్టం దావా వేశారు.

బెయిల్ లభించిన అనంతరం రాహుల్ గాంధీ కోర్టు హాలు నుంచి వెలుపలకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, తనపై దాడి జరుగుతోందని... అయితే, ఈ పోరాటాన్ని తాను ఎంజాయ్ చేస్తున్నానని చెప్పారు. తనది సిద్ధాంతాలతో కూడిన పోరాటమని చెప్పారు. పేదలు, రైతులకు అండగా తాను ఉంటానని తెలిపారు. తన పోరాటం కొనసాగుతుందని... గత ఐదేళ్లలో తాను చేసిన పోరాటం కంటే ఇకపై 10 రెట్లు ఎక్కువగా పోరాడుతానని చెప్పారు. కోర్టులో తాను ఏమీ మాట్లాడలేదని... విచారణకు హాజరుకావడానికి మాత్రమే వచ్చానని తెలిపారు.

  • Loading...

More Telugu News