Andhra Pradesh: కోడెల శివప్రసాద్ ప్రారంభించిన బస్ షెల్టర్ ను ధ్వంసం చేసిన దుండగులు!

  • గుంటూరు జిల్లాలోని కొత్తపల్లిలో ఘటన
  • బస్ షెల్టర్, శిలాఫలకం, ఆర్చ్ ధ్వంసం
  • పోలీసులకు సమాచారం అందించిన గ్రామస్తులు

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం, కొత్తపల్లి గ్రామంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ పేరుతో ఉన్న బస్ షెల్టర్ ను గుర్తుతెలియని దుండగులు ఈరోజు ధ్వంసం చేశారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోడెల ప్రారంభించిన ఈ బస్ షెల్టర్, శిలాఫలకం, ఆర్చ్ లను దుండగులు ధ్వంసం చేశారు. బస్ షెల్టర్ ధ్వంసమైన విషయాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు  సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News