Congress: ఇదో రకం నివాళి.. సంతాప సభలో స్టెప్పులేసిన ఎమ్మెల్యే!

  • చాందినీ గొందా వ్యవస్థాపకుడు ఖుమన్ లాల్ మృతి
  • చివరి కోరికను తీర్చేందుకు స్టెప్పులేసిన ఎమ్మెల్యే
  • సంతాప సభలో పాల్గొన్న జానపద కళాకారులు

ఒక సామాజిక సంస్థ వ్యవస్థాపకుడు చనిపోతే ఆయన సంతాప సభను ఏర్పాటు చేశారు. ఈ సంతాప సభలో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు స్టెప్పులేశారు. ఛత్తీస్‌గఢ్‌లోని సామాజిక సంస్థ చాందినీ గొందా వ్యవస్థాపకుడు ఖుమన్‌లాల్ షా, గాయకుడు లక్ష్మణ్ మస్తూర్యా ఇటీవల మృతి చెందారు. వారి మృతికి సంతాప సూచకంగా ఏర్పాటు చేసిన సభలో గుండాదేహీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కున్వర్‌సింగ్ డ్యాన్స్ చేసి మరణించిన వారికి నివాళులర్పించారు. ఖుమన్‌లాల్ చివరి కోరిక మేరకు ఈ విధంగా చేసినట్టు కున్వర్ సింగ్ తెలిపారు. సాంస్కృతిక జానపద కళాకారులతో కలిసి కున్వర్ సినిమా పాటలకు డ్యాన్స్ చేశారు.

Congress
Chattisgarh
Khumanlal
Lakshman Masturya
Kunvar Singh
  • Loading...

More Telugu News