Sarvanand: శర్వానంద్‌ను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసిన వైద్యులు

  • షూటింగ్ సమయంలో శర్వా కుడి చేతికి ఫ్రాక్చర్
  • గత కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న శర్వా
  • అత్యాధునిక చికిత్స అందించామన్న వైద్యులు
హీరో శర్వానంద్ నేడు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. బ్యాంకాక్‌లో షూటింగ్ చేస్తున్న సమయంలో శర్వా కుడి చేతికి ఫ్రాక్చర్ అయింది. దీంతో శర్వా నేరుగా హైదరాబాద్‌ చేరుకుని సన్‌షైన్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకుని, చికిత్స పొందుతున్నాడు. సన్‌షైన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ గురవారెడ్డి శర్వాకు వైద్య చికిత్స అందించారు.

శర్వా గాయాల గురించి సన్‌షైన్ ఆసుపత్రి వైద్యులు మాట్లాడుతూ, అత్యాధునిక చికిత్సనందించి గాయం త్వరగా మానేలా చేశామన్నారు. ప్రస్తుతం శర్వా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. గాయం తీవ్రత తగ్గిన కారణంగానే శర్వాను ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేశామని వైద్యులు వెల్లడించారు.
Sarvanand
Sunshine Hospital
Dr. Guruva Reddy
Discharge
Bankok

More Telugu News