108: 108 సేవలు ఆలస్యమైతే చర్యలు తీసుకుంటాం: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి

  • 108 కాల్ సెంటర్ నిర్వాహకులతో సమీక్ష సమావేశం
  • నిధులు సిద్ధం చేసుకోవాలంటూ స్పష్టీకరణ
  • ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం ఉండదన్న జవహర్ రెడ్డి

ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఈ సాయంత్రం 108 కాల్ సెంటర్ నిర్వహిస్తున్న జీవీకే సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. రాష్ట్రంలో 108 సేవల తీరుతెన్నులపై ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 108 సేవలు ఆలస్యమైతే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. 108 వాహనాల్లో ప్రాథమిక చికిత్స సామగ్రి అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. 108 వాహనాల నిర్వహణ కోసం నిధులు సిద్ధం చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం నుంచి నిధుల విడుదలలో జాప్యం లేకుండా చూస్తామని జవహర్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న నిధుల విడుదల కోసం నివేదికలు సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు.

108
Andhra Pradesh
  • Loading...

More Telugu News