India: సింహలగ్నంలో పాక్ తో పోరు... గ్రహాలన్నీ ఇండియాకే అనుకూలమంటున్న జ్యోతిష్యులు!

  • మరికాసేపట్లో ఇండియా, పాక్ మ్యాచ్
  • భారత టీమ్ జాతకం బాగుందంటున్న జ్యోతిష్యులు
  • పాక్ ఎత్తుగడలు పారబోవని జోస్యం

యావత్ క్రీడా ప్రపంచం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయం వచ్చింది. మాంచెస్టర్ వేదికగా, ఇండియా, పాకిస్థాన్ ల మధ్య నేడు క్రికెట్ పోరు సాగనుండగా, గెలుపోటములను జ్యోతిష్యులు సైతం విశ్లేషించారు. నేటి మ్యాచ్ లో గ్రహగతులు ఇండియాకు అనుకూలంగా ఉన్నాయని తేల్చారు. సింహలగ్నంలో మ్యాచ్ ప్రారంభం కానుందని వ్యాఖ్యానించిన జ్యోతిష్యులు, పాక్ క్రికెట్ టీమ్ జాతకం కన్నా, ఇండియా జాతక సరళి బలంగా ఉందని, మ్యాచ్ జరిగితే గ్రహాలన్నీ భారత్ వైపే ఉంటాయని అంటున్నారు. పాక్ టీమ్ వేసే ఎత్తుగడలు బలహీనంగా ఉండనున్నాయని, ఆ జట్టు అంతః కలహాలు బయట పడనున్నాయని జోస్యం చెప్పారు. కాగా, ఇండియా గెలుపును కోరుకుంటూ, దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. ఇండోర్ లో ఏకంగా ఆరు అడుగుల పొడవైన అగరుబత్తీని ఫ్యాన్స్ శివధామ్ మందిరంలో ఏర్పాటు చేశారు. ఇది దాదాపు 30 గంటల పాటు నిరంతరాయంగా వెలగనుంది.

  • Loading...

More Telugu News